Sunday, January 19, 2025
HomeTrending Newsరేపు రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

రేపు రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

Murmu Tour: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆమె సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. ఆమె గౌరవార్ధం జగన్ తన నివాసంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకూ బహిరంగంగా వెల్లడించకపోయినా ముర్ముకు అనుకూలంగానే ఆ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్