Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీలో కనిపించనున్న ‘దృశ్యం-2’

ఓటీటీలో కనిపించనున్న ‘దృశ్యం-2’

Drushyam 2 Will Be Releasing On Amazon Prime From November 25th :

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ‘దృశ్యం 2’. ఈ చిత్రానికి మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దృశ్యం స‌క్స‌స్ అవ్వ‌డంతో దానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందించారు. ఇందులో వెంకీ స‌ర‌స‌న మీనా న‌టించారు. మ‌ల‌యాళంలో ఈ సినిమా స‌క్స‌స్ అయ్యింది. దీంతో తెలుగులో ఎంత వ‌ర‌కు మెప్పిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

అయితే.. వెంకీ న‌టించిన‌ ‘నార‌ప్ప’ థియేట‌ర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో ఓటీటీలో రిలీజ్ చేశారు. ‘దృశ్యం 2’ ను మాత్రం థియేట‌ర్లోనే రిలీజ్ చేయ‌డానికి సురేష్ బాబు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో దృశ్యం 2 థియేట‌ర్లోకి వ‌స్తుంద‌ని వెంకీ అభిమానులు ఎదురు చూస్తుంటే.. ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ఈరోజు మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు  నవంబర్ 25న దృశ్యం 2 రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా అనౌన్స్ చేశారు.

Also Read : ‘దృశ్యం-2’ సెన్సార్ పూర్తి

ఓటిటి లో కనబడనున్న ‘దృశ్యం’?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్