Saturday, January 18, 2025
HomeసినిమాDulquer Salmaan: టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan: టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన దుల్కర్ సల్మాన్

మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. మహానటి సినిమాలో జెమిని గణేష్ పాత్రలో కీర్తి సురేష్ కు జంటగా నటించి మెప్పించాడు. ఆతర్వాత కొన్ని డబ్బింగ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్నాడు. ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీంతో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఓ వైపు మలయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో సినిమాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

తెలుగులో ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. జాతీయ అవార్డ్ గ్రహీత జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఒక సాధారణ మనిషి అసాధారణమైన ప్రయాణం అనే విభిన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని తెలిసింది.

తెలుగులో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ మూవీ కల్కిలో కూడా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం గురించి దుల్కర్ ని అడిగితే.. ఈ కథ గురించి తెలుసు.. కల్కి ఇప్పటి వరకు తెర పై రాని సరికొత్త కథాంశతో రూపొందుతున్న చిత్రమిది. ఇండియన్ సినిమాకే గర్వకారణం. అయితే.. ఇందులో నటిస్తున్నానా..? లేదా..? అనేది నిర్మాణ సంస్థ చెబుతుంది.. నేను చెప్పకూడదు అన్నాడు కానీ..  ఇదేదో గ్యాసిప్ అనలేదు. దుల్కర్ మాటలను బట్టి కల్కిలో నటిస్తున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మొత్తానికి దుల్కర్ టాలీవుడ్ పై బాగానే ఫోకస్ పెట్టాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్