Friday, October 18, 2024
Homeసినిమా'కింగ్‌ ఆఫ్‌ కోత' నా కెరీర్ బిగ్గెస్ట్ సినిమా: దుల్కర్‌ సల్మాన్

‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నా కెరీర్ బిగ్గెస్ట్ సినిమా: దుల్కర్‌ సల్మాన్

దుల్కర్‌ సల్మాన్ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో వుంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. రానా దగ్గుబాటి, నాని ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

దుల్కర్‌ సల్మాన్ మాట్లాడుతూ…”అందరికీ నమస్కారం. ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని అందరూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. అందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ మా అందరి డ్రీమ్ ప్రాజెక్ట్. గత ఏడాది అంతా ఈ చిత్రం పైనే వర్క్ చేశాం. నా కెరీర్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టార్ డ్రామా. మీరంతా ఈ చిత్రాన్ని మెచ్చుకొని పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇష్టపడే నాని గారికి చాలా థాంక్స్. నాని  ‘హాయ్ నాన్న’ కోసం ఎదురుచూస్తున్నాను. నా మిత్రుడు రానా. నేను తనని చీఫ్ అని పిలుస్తాను. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. భాషలకు అతీతంగా చిత్రాలని ఆదరిస్తున్నాను.

‘కింగ్‌ ఆఫ్‌ కోత’ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఐశ్వర్య, అనిఖా, .. ఇంకా చిత్రంలో భాగమైన అందరికీ థాంక్స్. అభిలాష్ జోషి కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తెలుగులో నా వాయిస్ వుంటుంది. చాలా చక్కగా వుంది. మా పార్ట్నర్స్  జీ స్టూడియోస్ కి కృతజ్ఞతలు. ఆగస్ట్ 24 న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ చిత్రంలో  డ్యాన్స్ , యాక్షన్, సాంగ్స్ , ఎమోషన్స్ అన్నీ వుంటాయి. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. ఆగస్ట్ 24న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్