Sunday, January 19, 2025
HomeTrending Newsఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.  ఫోర్టున పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది. భూకంపం ధాటికి హంబోల్డ్‌ట్‌ కౌంటీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

యురేకా ప్రాంతంలో ప్రాణ, ఆస్తి నష్టం అంతగా లేకున్నా అర్దరాత్రి నుంచి ప్రజలు చిమ్మ చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. విద్యుత్ వ్యవస్థ కుప్ప కులతంతో కూలటంతో 12 వేల మందికిపైగా అంధకారంలో చిక్కుకుపోయారని చెప్పారు. వాణిజ్య సముదాయాలు, ఇండ్లకు విద్యుత్‌ నిలిచిపోయిందన్నారు. భూకంపం వల్ల ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, కొన్ని బిల్లడింగులు, రహదారులు ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

Also Read : ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్