Sunday, September 8, 2024
HomeTrending Newsరేవంత్ రెడ్డిపై ఈడి చార్జిషీట్ దాఖలు

రేవంత్ రెడ్డిపై ఈడి చార్జిషీట్ దాఖలు

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత, లోక్ సభ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడి) చార్జిషీట్ దాఖలు చేసింది. తెలంగాణా అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) విచారణ తర్వాత దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా రేవంత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. శాసన మండలి ఎన్నిక సందర్భంగా క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌తో రాయబారం నడిపిన రేవంత్‌రెడ్డి ఆయనకు రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయడాల్సిందిగా  ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం నమోదు చేసింది. ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి పేరు ఉంది. అయితే ఈ కేసులో స్టీఫెన్ సన్ తో తెలుగుదేశం అధినేత చందబాబు ఫోన్ లో మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈడి తాజా చార్జిషీట్ తో చంద్రబాబుకు ఈ కేసు నుంచి విముక్తి లభించిందని భావిస్తున్నారు.

ఓటుకు నోటు కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ కేసులో చందబాబుపై మొదట్లో హడావుడి చేసిన తెలంగాణా ప్రభుత్వం ఆ తరువాత కేసు పురోగతిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ కేసు దరిమిలా చేసుకున్న లోపాయికారీ ఒప్పందం వల్లే చంద్రబాబు రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి వెళ్ళారని నాటి విపక్షం…. నేటి ఏపి అధికార పక్షం వైసిపి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్