Sunday, January 19, 2025
HomeTrending Newsఈడీ పరిధి అతిక్రమిస్తోంది - మంత్రి జగదీష్ రెడ్డి

ఈడీ పరిధి అతిక్రమిస్తోంది – మంత్రి జగదీష్ రెడ్డి

కేంద్రప్రభుత్వ అధీనం లోని ఈ డి తనకున్న పరిధులను అతిక్రమించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.బి ఆర్ యస్ కు చెందిన కవితను విచారణ పేరుతో నిబంధనలు ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమన్నారు.గురువారం రాత్రి సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం మహిళ అన్న విజ్ఞత మరచిపోయిన ఈడి అధికారులు విచారణ పేరుతో అర్ధరాత్రి వరకు సతాయించడం ఎందంటూ ఆయన కేంద్రప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడంలో మోడీ సర్కార్ దిట్ట అని మరోమారు రుజువు చేస్తోందన్నారు.యం ఎల్ సి కవిత పై ఈ డి అధికారులు మోపిన అభోయోగం ముమ్మాటికీ రాజకీయ కక్ష్య తోటేనని ఆయన ఆరోపించారు. అటువంటి బిజెపికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

Also Read : ఈడి విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్