Thursday, November 28, 2024
HomeTrending Newsఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు

ఉన్నత చదువులకు డీసీసీబీ రుణాలు

రైతులతో పాటు విద్యార్థులకు ‘సహకారం’ అందించటంలో భాగంగా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నత చదువులకు డీసీసీబీ చేయూత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం విద్యార్థులకు విద్యా రుణాలు డిసిసిబి నుంచి పొందవచ్చన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించారు. విదేశీ విద్య కోసం హేమంత్ రెడ్డికి రూ.23 లక్షల చెక్కును అందజేసిన మంత్రి. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డిసిసిబి నుంచి త్వరలోనే హౌసింగ్ రుణాలకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే ప్రభుత్వ ఉద్దేశం.. ముఖ్యమంత్రి కేసీఆర్ తపన అన్నారు. పేద విద్యార్థులకు విదేశీ విద్య కోసం 2015 అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.20 లక్షల సాయం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం..ఇప్పుడు డీసీసీబీ ముందుకు రావడం అభినందనీయం అన్నారు.

గతంలో ఆర్థిక చేయూత లేక ఉన్నత చదువులకు, విదేశీ విద్యకు దూరమైన విద్యార్థులకు డిసిసిబి రుణాలతో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, కజకిస్తాన్, రష్యాలలో ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్, ఎంబీబీఎస్ చదువులకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ప్రతిభ గల విద్యార్థులు డీసీసీబీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

Also Read10 ఎకరాల లోపు వారికే రైతుబంధు – మంత్రి నిరంజన్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్