Sunday, January 19, 2025
HomeTrending Newsవిద్యాసంస్థలు కొనసాగుతాయి - పాకిస్తాన్

విద్యాసంస్థలు కొనసాగుతాయి – పాకిస్తాన్

కరోనా వేగంగా వ్యాపించినా, ఓమిక్రాన్ కేసులు పెరిగినా విద్యాసంస్థల కొనసాగుతాయని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రోజు ఇస్లామాబాద్ లో జరిగిన జాతీయ కమాండ్ మరియు ఆపరేషన్ సెంటర్ సమావేశంలో కేంద్రప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్రాల వైద్య,ఆరోగ్య,విద్య శాఖల మంత్రులు పాల్గొన్నారు.  సమావేశంలో సుదీర్ఘంగా చర్చిన నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారితో అనేక రంగాలు కుదేలు అయ్యాయని, ఇప్పటికే దేశం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ తరుణంలో విద్యా సంస్థలను మూసివేస్తే భవిష్యత్ తరాలకు ద్రోహం చేసినవారం అవుతామని పాక్ ప్రకటించింది.

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించిన నేతలు బస్సులు, విమానాల్లో భోజనాల పంపిణి నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి బస్సులు, విమానాలల్లో ఆహార పంపిణి జరగదు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉన్న సింద్ రాష్ట్రంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. సింద్ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉన్నా విద్యా సంస్థలను ముసివేయబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా పాజిటివిటి రేటు 8.7 శాతంగా ఉండగా దేశ వాణిజ్య రాజధాని, సింద్ రాష్ట్ర రాజధాని అయిన కరాచి నగరంలో పాజిటివిటి రేటు 40 శాతంగా ఉండటం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. గత పది రోజులుగా వస్తున్నా కేసుల్లో 95 శాతం ఓమిక్రాన్ కేసులే ఉన్నాయని, వైద్య సేవలు అందిచలేక చాలా మంది వైద్య సిబ్బంది ఇళ్లకే పరిమితం అయ్యారని సింద్ అధికార వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్