Friday, September 20, 2024
HomeTrending Newsఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

ఢిల్లీలో వాయు కాలుష్యంతో నెల రోజులుగా మూతపడిన విద్యా సంస్థలు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆఫ్ లైన్ క్లాసులు ప్రారంభించవచ్చని, ప్రాథమిక విద్యాలయాలు మినహా ఆరవ తరగతి నుంచి అన్ని విద్యాలయాలు నడిపేందుకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ బోర్డు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. అయితే ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ తరగతులకు కూడా ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులు ఖచ్చితంగా హాజారు కావాలనే నిబంధన ఏది లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) ప్రకారం ఢిల్లీ వాయు కాలుష్యం కొంత తగ్గిందని, దశల వారిగా అన్ని విద్యా సంస్థల ప్రారంభానికి అనుమతి ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రాథమిక విద్యాలయాల ప్రారంభంపై ఈ నెల 27 వ తేదిన నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లో వాయు కాలుష్యం ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం నార్త్ క్యాంపస్ వద్ద 277 ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 258గా నమోదైంది. చాందిని చౌక్ లో 237 కాగా రోహిణి వద్ద 333 గా ఈ రోజు ఉదయం నమోదైంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్