Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యేగా ఈటెల ప్రమాణ స్వీకారం

Eetela Rajender Sworn As Mla  :

శాసనసభ సభ్యుడిగా ఈటెల రాజేందర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ భవనంలోని సభాపతి చాంబర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులుతోపాటు  బిజెపి నేతలు రాజ సింగ్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెరాస పార్టీకి రాజీనామా చేసి బీజేపిలో చేరిన ఈటెల ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న ఈటెల రాజీనామా తో ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మీద సుమారు 24 వేల మెజారిటీతో విజయం సాధించారు.

Also Read :హుజురా “బాద్ షా” ఈటెల  

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్