ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల పై అవగాహన దినోత్సవం కర పత్రాల ఆవిష్కరణ కార్యక్రమము
ఐక్యరాజ్యసమితి జూన్ 15 రోజుని ప్రతి సంవత్సరం ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల పై అవగాహన దినోత్సవంగా గుర్తించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (పరిపాలన) మస్తిపురం రమేశ్ ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల పై అవగాహన దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ వృద్ధులపై వేధింపులు ఆపాలని ప్రతి ఒక్కరు వయోవృద్ధుల పట్ల గౌరవంతొ మెలగాలని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులో ఎంత ప్రేమగా పోషించారో అదేవిధంగా పిల్లలు తమ తల్లిదండ్రులను నిజంగా ప్రేమతో చూసుకోవాలి అని తెలిపారు. వయో వృద్ధులు ఎటువంటి వేధింపులకు గురైనా, వయోవృద్ధుల సహాయక నెంబర్–14567 కి కాల్ చేస్తే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో FRO లు రాహుల్ మరియు శరత్ పాల్గొన్నారు..