Election Commission Of India Issued Schedule For Ap Mlc Elections For 3 Seats :
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. శాసనమండలిలో ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు నవంబర్ 29న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవసాని చిన గోవింద రెడ్డి, తెలుగుదేశం నుంచి శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, బిజెపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజులు మే 31న మండలి సభ్యులుగా రిటైర్ అయ్యారు. మార్చి నెలలోనే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ రెండో దశ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి.
నోటిఫికేషన్ : నవంబర్ 9, 2121
నామినేషన్ల దాఖలుకు చివరి తేది : 16 నవంబర్, 2021
నామినేషన్ల పరిశీలన : 17 నవంబర్, 2021
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది : 22 నవంబర్, 2021
పోలింగ్ తేదీ : 29 నవంబర్, 2021
పోలింగ్ సమయం : ఉదయం 9 నుంచి 4 గంటల వరకు
కౌంటింగ్ : 29 నవంబర్, 2021
ఈ మూడు స్థానాలూ అధికార వైఎస్సర్సీపీ కైవసం చేసుకోనుంది. ఈ వారంలోనే సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది. గోవింద రెడ్డి బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. నిన్ననే ముగిసిన బద్వేల్ ఉప ఎన్నికల్లో గోవింద రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. యన్నను మరోసారి శాసన మండలికి పంపే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని గోవింద రెడ్డి తో పాటు మరో ఇద్దరి పేర్లను ప్రకటించనున్నట్లు తెలిసింది.
Must Read :ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం: వెంకయ్య