Wednesday, May 7, 2025
HomeTrending Newsదూసుకుపోతున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 ప్లస్‌

దూసుకుపోతున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 ప్లస్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:34గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,058.20 పాయింట్లు లాభపడి 55,743.51 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 302.95 పాయింట్లు లాభపడి 16,645.20 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బిజెపి ముందజలో ఉండటం మార్కెట్ ను ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో బిజెపి అధికారం కైవసం చేసుకోనుందనే వార్తలు… స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకుపోతున్న బిజెపి ప్రభావం కొనుగోలుదారులను ఉత్సాహంగా కొనుగోళ్ళ వైపు తీసుకెళ్ళింది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.33గా ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30లోని టాటా స్టీల్‌ షేర్లు మినహా.. యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్టీపీసీ, టైటాన్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, రిలయన్స్‌ సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్