Friday, November 22, 2024
HomeTrending Newsదేశమంతా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు

దేశమంతా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు

Electric Vehicle Charging Stations  :

చమురు వాడకాన్ని తగ్గించడం, వాతావరణ కాలుష్యాన్ని నివారించడమనే ప్రధాన లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సాహిస్తున్నది. అందులో భాగంగా సబ్సిడీలను, రాయితీలను ప్రకటించింది. వీటితో పాటు సుదూర ప్రయాణంలో ఛార్జింగ్ సమస్యను తొలగించడానికి చర్యలు ప్రారంభించినది. అందులో భాగంగా దేశంలోని చమురు కంపెనీలు మొదటి దశలో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలు జాతీయ రహదారులపై మిషన్ మోడ్‌లో 22,000 వేల ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి.

ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 10,000 స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇది ఇప్పటికే 439 EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేసింది. వచ్చే సంవత్సరం దాని రిటైల్ అవుట్‌లెట్ నెట్‌వర్క్‌లో 2,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఇన్‌స్టాల్ చేయాలని యోచిస్తోంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మొత్తం 7,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా అందులో 1000 EV ఛార్జింగ్ స్టేషన్లు వచ్చే ఏడాదిలోగా ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే 52 స్టేషన్లను ఏర్పాటు చేసింది. అటు 382 ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేసిన హెచ్‌పీసీఎల్ వచ్చే ఏడాది 1000 స్టేషన్లు, మొత్తం 5000 స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ తో సహా కొన్నే సంస్థలు రాయితీ తో కూడిన రుణాలు కూడా ఇస్తున్నాయి.

Also Read : పూణే, ముంబయ్‌ల మధ్య ఎలక్ట్రిక్ బస్సు

RELATED ARTICLES

Most Popular

న్యూస్