Sunday, January 19, 2025
HomeTrending Newsట్విట్టర్‌ హస్తగతమయ్యాక ఎలన్ మస్క్ కొత్త టార్గెట్

ట్విట్టర్‌ హస్తగతమయ్యాక ఎలన్ మస్క్ కొత్త టార్గెట్

Alan Musk new target : ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్. ఈ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆ తరువాత తన కొత్త టార్గెట్ ప్రకటించాడు.. అదే కోకాకోలా.

దీనిమీద ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ ట్వీట్ లో తన తదుపరి లక్ష్యం కోకాకోలాను కొనడమేనని.. ఎందుకంటే దాంట్లో కొకైన్ ను తిరిగి కలపాలని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ తరువాత మరో పాత ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అందులో ఇప్పుడు తాను మెక్‌డొనాల్డ్స్ కొనబోతున్నానని.. అక్కడి అన్ని ఐస్ క్రీమ్ మెషీన్‌లను సరిచేయబోతున్నానని ఉంది… అంతేకాదు ఈ ట్వీట్ ను షేర్ చేస్తూ వినండి తాను అద్భుతాలు చేయలేనని సరదాగా రాసుకొచ్చారు.

ఎలన్ మస్క్ ఇలాంటి విచిత్రమైన ప్రకటనలకు పేరొందాడు. ట్విట్టర్ ను టేకోవర్ చేయడానికి ముందే ఇలాంటి ట్వీట్లతో అతను ఎప్పుడూ ట్విట్టర్ యూజర్లలో ముందు వరుసలో ఉండేవాడు. అంతేకాదు మస్క్ గతంలో, ట్విట్టర్ వినియోగదారులకు పోల్ కూడా నిర్వహించాడు. తాను అవాస్తవిక మూలధన లాభాల కోసం చెల్లించడానికి తన టెస్లా స్టాక్‌లో 10% విక్రయించాలా అని అడిగాడు. ఆ పోల్ ప్రకారం అతను 57% పోల్‌లో ఫలితాల ప్రకారం.. దాదాపు $7 బిలియన్ల టెస్లా షేర్లను విక్రయించాడు. ఇందులో పాల్గొన్నవారు అతని సూచనకు అనుకూలంగా ఓటు వేశారు.

ఇలాగే ట్విటర్ కొనుగోలు చేయడానికి కొద్ది రోజుల ముందు టెస్లా వ్యవస్థాపకుడు మస్క్.. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడానికి తానైతే ఏమేమి చేయగలడో.. ఎలా చేయచ్చో.. ఆలోచనల్ని పంచుకున్నాడు. అందులో కొన్ని చాలా తీవ్రమైనవిగా కనిపించాయి. ఎడిట్ బటన్ ను ప్రవేశపెట్టడం, ట్విట్టర్ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయాన్ని నిరాశ్రయుల ఆశ్రయంగా మార్చడం వంటి పూర్తిగా వింతగా అనిపించే ప్రకటనలు చేశాడు.

ఈ కోవలోనే అతను ఇటీవల చేసిన కోకా-కోలా ట్వీట్.. పూర్తిగా సరదాగా గుర్తించబడనప్పటికీ, అతని విచిత్రమైన సోషల్ మీడియా స్టేట్‌మెంట్‌లపై చర్చ జరుగుతుంది. అంతేకాదు మస్క్ హిస్టరీని బట్టి కొకైన్‌తో ఉన్న ప్రముఖ పానీయాల కంపెనీలకు ఆమోదం తెలిపేలా ఉంది. కోకా కోలా ట్రేడ్‌మార్క్ శీతల పానీయం. దీని తయారీలో రెండు ప్రాథమిక పదార్థాలను వాడుతారు. ఒకటి కోకా ఆకులు, రెండు కోలా గింజలు. కోలా గింజలు కెఫిన్ కు మూలం. అయితే, కోకా ఆకుల నుండి సైకోయాక్టివ్ డ్రగ్ కొకైన్ తీయబడుతుంది.

కోకా-కోలా ఒక సమయంలో కోకా ఆకులను ఉపయోగించింది, వాటిలో కొకైన్ ఉంటుంది, ఈ పదార్ధం పందొమ్మిదవ శతాబ్దంలో ఔషధంగా పరిగణించబడేది. ఇప్పటికీ భావించే వారు ఉన్నారు. అయినప్పటికీ, ఔషధం నిషేధితమయ్యింది. ఈ నిషేధం USను తాకడంతో, కొకైన్ ను వారు తమ సీక్రెట్ ఫార్ములా నుంచి తీసివేశారు. బదులుగా డీకోకైనైజ్డ్ కోకా ఆకులతో తయారు చేస్తున్నారు.

Also Read : చేతులు మారనున్న ట్విట్టర్  

RELATED ARTICLES

Most Popular

న్యూస్