Saturday, July 6, 2024
HomeTrending Newsచర్చలు సఫలం: ఉద్యోగుల సమ్మె విరమణ

చర్చలు సఫలం: ఉద్యోగుల సమ్మె విరమణ

Strike withdrawn: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ ప్రకటించారు. మంత్రుల కమిటీ తో ఉద్యోగ సంఘాల పీఆర్సీ సాధన సమితి నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. ఉద్యోగులు పెట్టిన పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో ఉద్యోగ నేతలు వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై అంగీకార పత్రం రాసుకున్నారు. మంత్రుల కమిటి ప్రతిపాదనలను సిఎం జగన్ కు పంపగా అయన ఆమోదించారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలు సిఎం జగన్ తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

  • ప్రభుత్వం ఆమోదించిన అంశాలు
  • పీఆర్సీ నివేదిక ఇవ్వాలని నిర్ణయం- దానిపై జీవో విడుదల చేస్తామన్న ప్రభుత్వం
  • 23 శాతం ఫిట్మెంట్ కొనసాగుతుంది- దానిలో మార్పు లేదు
  • ఉద్యోగ సంఘాల హెచ్ ఆర్ ఏ శ్లాబ్స్
  • 50  వేల వరకూ జనాభా ఉంటె 10 శాతం- గరిష్ట పరిమితి రూ. 11 వేలు
  • 50 వేల నుంచి 2 లక్షల వరకూ ఉంటే 12 శాతం – గరిష్ట పరిమితి రూ.13 వేలు
  • 2 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా 16 శాతం – గరిష్ట పరిమితి రూ.17 వేలు
  • 50 లక్షలకు పైగా ఉంటె 24 శాతం – గరిష్ట పరిమితి రూ. 25 వేలు
  • సెక్రటేరియట్, హెచ్ఓడి ఉద్యోగులకు 24 శాతం హెచ్.ఆర్.ఏ. జూన్ వరకూ 2024 అదే కొనసాగుతుంది
  • పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం- 70-74 ఏళ్ళకు సంబంధించి 7 శాతం; 77-79 ఏళ్ళ మధ్య వారికి 12 శాతం
  • ఐ ఆర్ రికవరీ ప్రతిపాదన ఉపసంహరించుకున్నాం
  • పీఆర్సీ ఐదేళ్లకోసారి ఇవాలని నిర్ణయం
  • అంత్యక్రియల ఖర్చు 25 వేల రూపాయలు
  • సిసియే పునరుద్ధరణ
RELATED ARTICLES

Most Popular

న్యూస్