Tuesday, March 25, 2025
HomeTrending Newsఛత్తీస్ ఘడ్ లో ఎన్‌కౌంటర్‌, ముగ్గురి మృతి

ఛత్తీస్ ఘడ్ లో ఎన్‌కౌంటర్‌, ముగ్గురి మృతి

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్‌, ఎకె47 రైఫిల్‌ల తో పాటు విప్లవ సాహిత్యం లభ్యమయ్యాయి. బీజాపూర్ జిల్లా తర్లగూడ,తెలంగాణ ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో అటవీ గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి.

వాజేడు మండలం పేరూరు. పోలీస్ స్టేషన్ లిమిట్స్ తెలంగాణ చతిస్గడ్ బార్డర్లో లో ఎన్కౌంటర్ జరిగినట్టు ఎస్పి గౌస్ ఆలం ధ్రువీకరించారు. మావోయిస్టులు ముగ్గురు చనిపోగా ఇంకా ఎంత మంది చనిపోయారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

తెలంగాణ సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు మావోల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. అటవీ గ్రామాల్లో ఇంటింటిని సోదా చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు ఎలాంటి అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్