జమ్మూకశ్మీర్ కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు సోమవారం తెలిపారు. కుల్గామ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుల్గామ్‌లోని హసన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్ కౌంటర్ గా మారిందని కశ్మీర్ జోన్ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.
శీతాకాలం కావటంతో ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ వైపు నుంచి ఉగ్రమూకల చొరబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అధికార యంత్రాంగం, భద్రతా బలగాలు మంచు తుపాను బాధిత ప్రాంతాల్లో పౌరులకు అండగా ఉంటారు. ఇదే అదునుగా తీవ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు విఫలయత్నం చేస్తుంటారు.
Also Read : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా