టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ తో పాటు గుంటూరులోని నివాసంతో పాటు ఆయన బందువుల ఇళ్ళలో మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
వ్యాపారవేత్త మాలినేని సాంబశివరావు ఇంటిపై కూడా ఈడీ తనిఖీలు చేపట్టింది. నాలుగు కంపెనీలు… ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్ లకు డైరెక్టర్ గా మాలినేని కొనసాగుతున్నారు.
రాయపాటికి చెందిన ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ బ్యాంకు రుణాల ఎగవేతపై గతంలో సిబిఐ కేసు నమోదైంది. దీని విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టారు. బ్యాంకుల నుంచి రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలున్నాయి. వీటి నుంచి షుమారు 7 వేల కోట్లు రుణాలు దారి మళ్ళించారంటూ మనీ లాండరింగ్ కింద కేసు నమోదైంది.