ఐర్లాండ్ తో స్వదేశంలోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ పది వికెట్ల తేడాతో గెల్చుకుంది. తొలి ఇన్నింగ్స్ ను 4 వికెట్లకు 524 పరుగుల వద్ద ఇంగ్లాండ్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. 352 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఐర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. మార్క్ అడైర్-88; అండీ మెక్ బ్రెయిన్-86; హ్యారీ టెక్టార్-51; టకర్-51 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5; బ్రాడ్, పాట్స్, జాక్ లీచ్, రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ లో ఓపెనర్ జాక్ క్రాలే మూడు బంతుల్లో నాలుగు ఫోర్లతో 12 పరుగులు చేసి విజయం అందించాడు. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది,
డబుల్ సెంచరీ చేసిన ఓలీ పోప్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది