తేజ హీరోయిన్ కి తప్పని నిరాశ!

తేజ సినిమాలను పరిశీలిస్తే కొత్త హీరోహీరోయిన్లతో చేసినవే ఎక్కువగా కనిపిస్తాయి. ఆయన తన కెరియర్ ఆరంభంలో ఎక్కువగా యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు. ‘చిత్రం’ .. ‘జయం’ .. ‘నువ్వు నేను’ వంటి సినిమాలు పెద్ద హిట్లను ఆయన ఖాతాలో వేశాయి. కథా పరంగా .. పాటల పరంగా కూడా ఈ సినిమాలు యూత్ ను ఎంతో ప్రభావితం చేశాయి. అప్పటి యూత్ కేటగిరిలో ఉన్నవారు ఇప్పటికీ ఆ సినిమాలను మరిచిపోలేదు. అంతగా ఆ కథను వాళ్లకి కనెక్ట్ అయ్యాయి.

లవ్ స్టోరీస్ ద్వారా తేజ కొత్త హీరోలను మాత్రమే కాదు .. హీరోయిన్స్ ను కూడా పరిచయం చేశాడు. వాళ్లలో స్టార్ డమ్ ను సంపాదించుకున్నవారిలో కాజల్ .. సదా ముందు వరుసలో కనిపిస్తారు. హీరోయిన్స్  కేరక్టర్స్ ను కూడా తేజ డిజైన్ చేసే విధానంగా కొత్తగా ఉంటుందని అంటూ ఉంటారు. ‘జయం’లో సదా క్యారెక్టరైజేషన్ ను ఇంతవరకూ చాలామంది మరిచిపోలేదు. అప్పట్లో చాలామంది హీరోయిన్స్ ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనుకునేవారు.

ఇక నిన్న థియేటర్లకు వచ్చిన ‘అహింస’ సినిమా ద్వారా కూడా ఆయన ‘గీతిక’ అనే కొత్త హీరోయిన్ ను పరిచయం చేశాడు. ఈ సినిమాలో అభిరామ్ జోడీగా ఆమె కనిపించింది. ఇంగ్లిష్ ముద్దు పెట్టమంటూ హీరోను సతాయించే పాత్రలో ఆమె సందడి చేసింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ ఉంది. ఇది ఆమెకు నిరాశను కలిగించే విషయమే. మరి మున్ముందు గీతిక ఎంచుకునే పాత్రలు ఆమెను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *