న్యూజిలాండ్ తో ఆ దేశంలో జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతోంది. విజయానికి 258 పరుగులు అవసరం కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండడంతో ఏవో అద్భుతాలు జరిగితే తప్ప ఇంగ్లాండ్ గెలుపులు ఆపడం సాధ్యంకాదు.
ఫాలో ఆన్ ఆడుతూ నిన్న మూడోరోజు మూడు వికెట్లకు 202 పరుగుల వద్ద కివీస్ నేడు నాలుగో రోజు ఆట మొదలు పెట్టింది. నిన్న 25 పరుగులతో క్రీజులో ఉన్న మాజీ సారధి కెన్ విలియమ్సన్ 132 పరుగులు చేసి సత్తా చాటాడు. డెరిల్ మిచెల్ అర్ధ సెంచరీ (54) చేయగా… టామ్ బ్లండెల్ 90 పరుగులు సాధించి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీనితో కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 483 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5; రాబిన్సన్, స్టువార్ట్ బ్రాడ్, జో రూట్, హ్యారీ బ్రూక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 39 పరుగుల వద్ద ఓపెనర్ జాక్ క్రాలే (24) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ బెన్ డకెట్-23; ఓలీ రాబిన్సన్-1 పరుగుతో క్రీజులో ఉన్నారు.