Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్రూట్ సెంచరీ - ఇంగ్లాండ్ 423/8

రూట్ సెంచరీ – ఇంగ్లాండ్ 423/8

ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేసింది.  120 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఎమినిది వికెట్లకు 423 పరుగులు చేసింది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలతో రాణించిన ఇంగ్లాండ్ సారధి జో రూట్ మరోసారి శతకం (121) సాధించి హ్యాట్రిక్ కొట్టాడు.  డేవిడ్ మలన్-70; హశీబ్ హమీద్-68;  జోసెఫ్ బర్న్స్-61 పరుగులతో రాణించారు. ప్రస్తుతం క్రెగ్ ఓవర్టన్(24); ఓలీ రాబిన్సన్ (0) క్రీజులో ఉన్నారు.

మహ్మద్ షమీ-3, సిరాజ్-2, జడేజా-2 వికెట్లు పడగొట్టారు, మరో వికెట్ బుమ్రాకు దక్కింది. ఇంగ్లాండ్ ఇండియాపై 345 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్