Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్యాషెస్ సిరీస్: నాలుగో టెస్ట్ డ్రా

యాషెస్ సిరీస్: నాలుగో టెస్ట్ డ్రా

Sydney Test ends draw: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు జాక్ క్రాలే-77; బెన్ స్టోక్స్-60  బెయిర్ స్టో-41 పరుగులతో నిలకడగా ఆడి రాణించడంతో ఇంగ్లాండ్ మ్యాచ్ ను డ్రా వరకూ తీసుకెళ్లగలిగింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 270  పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 388 కాగా 30 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి చివరిరోజు ఆట మొదలుపెట్టింది. నేడు 90 ఓవర్లలో 358 పరుగులు కావాల్సి ఉండగా 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయగలిగింది.

బొలాండ్ మూడు; బొలాండ్, కమ్మిన్స్ చెరో రెండు; గ్రీన్, స్టీవ్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకుని గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.

కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడం కూడా ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది.

ఈ ఏడాది యాషెస్ సిరీస్ ను వైట్ వాష్ చేయాలన్న ఆస్ట్రేలియా ఆశలను ఇంగ్లాండ్ నిలువరించగలిగింది.

రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్