Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్England Vs New Zealand: క్లీన్ స్వీప్ దిశగా ఇంగ్లాండ్

England Vs New Zealand: క్లీన్ స్వీప్ దిశగా ఇంగ్లాండ్

ఇంగ్లాండ్- న్యూ జిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయనుంది. విజయానికి నేడు ఐదోరోజు 113 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. ఓలీ పోప్-81; జో రూట్ -55 పరుగులతో క్రీజులో ఉన్నారు.  వీరిద్దరితో పాటు జానీ బెయిర్ స్టో మంచి ఫామ్ లో ఉన్నాడు. దీనితో కివీస్ బౌలింగ్ లో ఏవైనా అద్భుతాలు చేయగలిగితే తప్ప ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ను కూడా గెల్చుకొని మూడు మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లీడ్స్ లోని హెడింగ్ లే మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లో  న్యూ జిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

స్కోరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి….

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ – 329 (డెరిల్ మిచెల్-109; టామ్ బ్లండెల్-55.. ఇంగ్లాండ్ బౌలింగ్- జాక్ లీచ్-5, స్టువార్ట్ బ్రాడ్-3)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 360 (బెయిర్ స్టో-162; ఓవర్టన్-97; స్టువార్ట్ బ్రాడ్-42 ….. న్యూజిలాండ్ బౌలింగ్- బౌల్ట్ -4; సౌతీ-3; వాగ్నర్-2)

న్యూజిలాండ్  రెండో ఇన్నింగ్స్ – 326 (టామ్ బ్లండెల్-88; లాథమ్-76; డెరిల్ మిచెల్-56; విలియమ్సన్-48…. ఇంగ్లాండ్ బౌలింగ్- జాక్ లీచ్-5, మ్యాటీ పాట్స్-3)

RELATED ARTICLES

Most Popular

న్యూస్