Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Women’s T20 WC:  విండీస్ పై ఇంగ్లాండ్ విజయం

Women’s T20 WC:  విండీస్ పై ఇంగ్లాండ్ విజయం

మహిళల టి 20 వరల్డ్ కప్  రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హెలీ మాథ్యూస్-42; కాంప్ బెల్లె -32 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ మూడు; బ్రంట్, గ్లెన్ చెరో వికెట్ పడగొట్టారు.

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కు (డానియెల్ వ్యాట్-11) 37 రన్స్ చేసింది.మరో ఓపెనర్ సోఫియా డంక్లీ18 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేసింది. ఆలీస్ క్యాప్సీ  (11) త్వరగా ఔటైంది. నటాలీ స్కైవర్ 40; కెప్టెన్ హెదర్ నైట్ 32 పరుగులతో అజేయంగా నిలిచి 14.3  ఓవర్లలోనే జట్టును గెలిపించారు.

స్కైవర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్