Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Women Ashes: టి20 సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

Women Ashes: టి20 సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న విమెన్ యాషెస్ సిరీస్ లో మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ ను ఆతిథ్య ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలలు 155 రన్స్ చేశారు. అయితే వర్షం కారణంగా  డక్ వర్త్ లూయూస్ పధ్ధతి ప్రకారం  ఇంగ్లాండ్ విజయ లక్ష్యాన్ని 14 ఓవర్లలో 119 పరుగులుగా నిర్ణయించారు.  మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ విజయం అందుకుంది.

లాడ్స్ మైదానంలో జరిగిన మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, ఆసీస్ మహిళల్లో… ఎల్లిస్ పెర్రీ-34; బెత్ మూనీ-32; గార్డ్ నర్-;32 గ్రేస్ హారిస్-25 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో నాటాలి స్కివర్ బ్రంట్ 2; చార్లోట్ డీన్, లారెన్ బెల్, గిబ్సన్, ఎక్సెల్ స్టన్ తలా ఒక వికెట్ సాధించారు.

ఇంగ్లాండ్ ప్లేయర్ అలేస్ క్యాప్సీ 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46;  డానియెల్ వ్యాట్ 15 బంతుల్ల్లో  6 ఫోర్లతో 26; నటాలీ బ్రంట్ 25 పరుగులతో రాణించడంతో 13.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం చేరుకుంది.

ఆసీస్ బౌలర్లలో మేగాన్ స్కట్ 2; డార్సీ బ్రౌన్, జేస్ జోనాస్సేన్, వారేహ్హం తలా ఒక వికెట్ పడగొట్టారు,.

ఆలీస్ క్యాప్సీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’, డానియెల్ వ్యాట్ కు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్