Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్India (W) Vs. England (W): ఇంగ్లాండ్ దే టి20సిరీస్

India (W) Vs. England (W): ఇంగ్లాండ్ దే టి20సిరీస్

ఇండియా-ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్ల జరిగిన మూడో 20లో ఇంగ్లాండ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో ఇండియా టాపార్డర్ విఫలమైంది. రిచా ఘోష్, దీప్తి శర్మ మాత్రమే రాణించారు. దీనితో 122 పరుగులు మాత్రమే ఇండియా చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని 18.2ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా మహిళలలు 35 పరుగులకే ఐదు వికెట్లు ( షఫాలీ వర్మ-5; స్మృతి మందానా-9; సబ్బినేని మేఘన-0; హేమలత-0; కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్-5)  కోల్పోయారు. స్నేహ్ రానా (8) కూడా విఫలమైంది. రిషా ఘోష్-33; దీప్తి శర్మ-24; పూజా వస్త్రాకర్-19 పరుగులు చేసి పరువు కాపాడారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ మూడు; సారా గ్లెన్ రెండు; బ్రయ్నీ స్మిత్, ఎఫ్ డేవిస్, వోంగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇంగ్లాండ్ తొలి వికెట్ (డానియేల్లె వ్యాట్-22) కు 70పరుగులు చేసింది. మరో ఓపెనర్ సోఫియా డంక్లీ 49పరుగులు చేసి త్రుటిలో అర్ధ సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ చేరింది. కెప్టెన్ జోన్స్ కేవలం మూడు పరుగులకే ఔటయ్యింది. ఆలీస్ కాప్సి-38, బ్రయోనీ స్మిత్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచి గెలిపించారు.

ఇండియా బౌలర్లలో స్నేహ్ రానా, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సోఫీ ఎక్సెల్ స్టోన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’….. సొఫియా డంక్లీ కి ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ లభించాయి.

Also Read : రాణించిన స్మృతి మందానా: ఇండియా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్