Sunday, September 22, 2024
HomeTrending Newsనిరీక్షణకు తెర, విజయం నాదే: ఈటెల

నిరీక్షణకు తెర, విజయం నాదే: ఈటెల

హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని, ఎన్నికల నోటిఫికేషన్  విడుదల కావడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేసి ఐదు నెలలు అయిందని,  నాటి నుంచి సిఎం కేసిఆర్ ప్రగతి భవన్ నుంచి, మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ నుంచి బైటకు వచ్చారని, వారిద్దరితో పాటు మరో అరడజను మంత్రులు హుజురాబాద్ మీద పడ్డారని విమర్శించారు.

రాజేందర్ మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

⦿ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా వ్యవహరించారు
⦿ హుజూరాబాద్ తో నా అనుబంధాన్ని తొలిగించే ప్రయత్నం చేశారు
⦿ హుజురాబాద్ పొలిటికల్ వ్యవస్థ- పార్టీ వ్యవస్థ పచ్చని సంసారంలా ఉండేది
⦿ హుజురాబాద్ ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేసి అనేక ప్రలోభాలకు గురి చేశారు
⦿ ఎన్ని ఇబ్బందులు పెట్టిన తొణకకుండా, జంకకుండా అండగా హుజురాబాద్ ప్రజానీకం నిలిచింది వారికి శిరస్సు వంచి మెక్కుతున్నా
⦿ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యచరణ మీద చెప్పాలి గానీ, స్వయంగా హరీష్ రావు సర్పంచ్ ల మీద, ఎంపిటిసిలమీద, పార్టీ నాయకుల మీద చిందులేశాడు
⦿ గుండెలు బరువెక్కినా తొలగకుండా నిలిచారు
⦿ దమ్మనపేటలో సమ్మిరెడ్డి అనే నేత ఇంటికి నేను వెళ్తే అతణ్ణి 0 రోజుకు ఇబ్బందులు పెట్టారు
⦿ చైతన్యవంతమైన బిడ్డగా నన్ను భావించి నా కండువా కప్పుకున్నాడు
⦿ డిఎస్పీతో ఎస్కార్ట్ పెట్టుకుని హరీష్ రావు ఆయన ఇంటికి పోయి తన వెంట రమ్మన్నాడు
⦿ హుజురాబాద్ లో సర్పంచ్ లు ఇతర ప్రజాప్రతినిధులు, కులసంఘాల మీద నమ్మకము లేదు
⦿ సిద్దిపేట నుండి ఇతర ప్రాంతాలను నుండి జనాల్ని తీసుకువస్తున్నారు
⦿ ఇసుల ట్రాక్టర్ నడవాలంటే పెన్షన్ రావాలంటే టి.ఆర్.ఎస్.కి ఓటు వేయాలన్నారు
⦿ దళిత బంధు రావాలంటే జెండా కట్టాలట
⦿ ఆశ వర్కర్, ఏ.ఎన్.ఎం. ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే పార్టీలతో తిరగవద్దని హుకుం జారీ చేశారు
⦿ నాకు ఒక కండక్టర్ కరచాలనం ఇస్తే ఆయన్ను తీసుకుపోయి సిరిసిల్లకు పంపారు
⦿ హుజురాబాద్ హాస్పిటల్లో 22 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు
⦿ కులసంఘాల నాయకులను ప్రలోభపెట్టారు డిసిఎం నిండా మందు తెప్పించి దావత్ లు ఇచ్చారు
⦿ దమ్ము, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడండి
⦿ నా హుజురాబాద్ అడబిడ్డలు దళిత జాతి, యువకులు జై ఈటెల అంటున్నారు
⦿ మొక్కవోని ధైర్యంతో అండగా నిలుస్తున్న వారి రుణం తీర్చుకోలేను
⦿ 18 సంవత్సరాలు చేసిన సేవ ఇప్పుడు కనబడుతుంది
⦿ తప్పకుండా విజయం సాధిస్తా

RELATED ARTICLES

Most Popular

న్యూస్