Sunday, September 8, 2024
Homeసినిమాఫ్యాన్స్ మెచ్చే 'సర్కారివారి పాట'

ఫ్యాన్స్ మెచ్చే ‘సర్కారివారి పాట’

Conclusion: మహేశ్ బాబు – పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన ‘సర్కారువారి పాట‘ ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సున్నితమైన కామెడీ చేయడంలో మహేశ్ కంటూ ఒక మార్కు ఉంది. ఆ తరహా కామెడీని అందించడంలో పరశురామ్ తన నైపుణ్యాన్ని ‘గీత గోవిందం’లోనే చాటుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి .. ఆత్రుత పెరుగుతూ వచ్చాయి. రిలీజ్ కి ముందే పాటలు జనంలోకి ఒక రేంజ్ లో వెళ్లడం వలన అంచనాలు మరింతగా  పెరుగుతూ వెళ్లాయి. అలాంటి భారీ అంచనాల మధ్య  ఈ సినిమా ఈ రోజున థియేటర్లలో దిగిపోయింది.

వేలల్లో బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్న సాధారణ ప్రజలు వాటిని నానా ఇబ్బందులు పడుతూ చెల్లిస్తుంటే, వేల కోట్లు అప్పులు తీసుకున్న కొంతమంది వ్యాపారులు మాత్రం ఎగ్గొడుతున్నారు. అలాంటివారి నుంచి ఆ డబ్బును రాబట్టడం కోసం ఒక యువకుడు ఏం చేశాడనేదే ఈ సినిమా కథ. మహేశ్ బాబు క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పరశురామ్ ఈ కథను అల్లుకున్న తీరు .. ఆవిష్కరించిన తీరు మరీ గొప్పగానూ లేదు .. అలాగని చెప్పేసి తీసికట్టు కూడా కాదు. మహేశ్ బాబు –   కీర్తి సురేశ్ లను ఆయన డిఫరెంట్ యాంగిల్ లో చూపించాడనడంలో సందేహం లేదు. కానీ ఈ ఇద్దరి లుక్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఇక ఈ కథ అంతా కూడా మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ .. సముద్రఖని పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఈ మూడు  పాత్రలను ఆయన డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంది. లవ్ .. ఎమోషన్ కథను అక్కడక్కడా టచ్ చేస్తే, కామెడీ .. యాక్షన్ పాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. పరశురామ్ మార్కు కామెడీ .. తమన్ మార్కు సంగీతం .. రామ్ లక్ష్మణ్ యాక్షన్ ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ త్వరగా అవగొట్టేద్దాం అన్నట్టుగా .. మరి కొన్ని సీన్స్ ను మరి కాస్త  లాగినట్టుగా అనిపిస్తాయి. వాటినన్నిటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తే, ఇది మహేశ్ మార్క్ సినిమాగానే కనిపిస్తుంది  .. ఆయన ఫ్యాన్స్ ను ఖుషీ చేసే సినిమాగానే అనిపిస్తుంది.

Also Read : సర్కారువారి పాట’ సక్సెస్ కోసమే కీర్తి సురేశ్ వెయిటింగ్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్