Monday, February 24, 2025
Homeసినిమాఎవరూ ఎవరికీ శత్రువులు కాదు: రోజా

ఎవరూ ఎవరికీ శత్రువులు కాదు: రోజా

ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎవరూ ఎవరికీ శత్రువులు కాదని, సినీనటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది 900మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబం. కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉదయం అందరూ కలిసికట్టుగా కనిపించడం సంతోషంగా ఉంది. కనీసం ఇప్పటికైనా మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా” అన్నారు

“ఇరు ప్యానెల్స్‌లోనూ నాతో పనిచేసిన నటులు ఉన్నారు. ఎవరు ఎక్కువ సమయం కేటాయించి కళాకారుల సమస్యలు తీరుస్తారో, దాన్ని బట్టే అందరూ ఓటు వేస్తారు. కరోనా కారణంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. విద్వేష రాజకీయాలు ఇక్కడితో ఆపండి. పక్క నుంచి మాట్లాడేవాళ్ల వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరికీ శత్రువులు కాదు’’అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్