ఆమధ్య సూయెజ్ కెనాల్లో జపాన్ నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోయి ప్రపంచవ్యాప్తంగా నౌకా రవాణా అతలకుతలమయిన సంగతి తెలిసిందే. యూరోప్ అమెరికాలకు ఆసియా మీదుగా వెళ్ళే ప్రధాన నౌకా మార్గంలో కృత్రిమంగా చాలా వ్యయ ప్రయాసలతో తవ్విన కెనాల్ సూయెజ్. జపాన్ నౌక ఈ కెనాల్ దగ్గర చిక్కుకుపోవడంతో సూయెజ్ కెనాల్ అథారిటికి దాదాపు 70 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నష్టం చెల్లిస్తే తప్ప నౌకను వదిలిపెట్టబోమని సూయెజ్ కెనాల్ అధికారులు తెగేసి చెప్పారు. చివరకు ఇన్సురెన్స్ కంపెనీలు, జపాన్ కు చెందినా నౌక యాజమాన్యం కాళ్ళా వెళ్ళా పడితే, అడ్డంకులు తొలగి ఇన్నాళ్ళకు ఎవర్ గివెన్ కదిలింది. సూయెజ్ అధికారులకు- నౌక యాజమాన్యానికి నష్టపరిహారం విషయంలో రాజి కుదిరింది.