Friday, November 22, 2024
HomeTrending NewsAP Exit Polls: కొన్ని సర్వే సంస్థలు అటు - మరి కొన్ని ఇటు...

AP Exit Polls: కొన్ని సర్వే సంస్థలు అటు – మరి కొన్ని ఇటు…

మే 13 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వివిధ సర్వే సంస్థలు నేడు విడుదల చేశాయి. అయితే  కొన్ని సంస్థలు అధికార వైసీపీవైపు మొగ్గు చూపగా…. మరికొన్ని విపక్ష తెలుగుదేశం-బిజెపి-జనసేన కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఇచ్చాయి.

రాష్ట్రంలో విశ్వసనీయత ఉన్న సంస్థగా పేరు తెచ్చుకున్న ఆరా మస్తాన్ హోరాహోరీ పోరులో వైసీపీ తిరిగి అధికారం చేజిక్కించుకుంటుందని అంచనా వేయగా…. గత ఎన్నికల్లో ఏపీ ఫలితాలపై నిక్కచ్చిగా  చెప్పిన కేకే సర్వే సంస్థ జగన్ పార్టీ కేవలం 14 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావచ్చని అంచనా వేసింది.

తెలుగుదేశం -133, జనసేన- 21, BJP-7 చోట్ల విజయం సాధించవచ్చని తెలియజేసింది. అంటే వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూఒడా దక్కించుకునే అవకాశం లేదని కేకే సంస్థ తెలిపింది.

ఆరా…. వైసీపీ 94నుంచి 104 స్థానాలు గెల్చుకుంటుందని, కూటమి 71-81 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. మహిళా ఓటర్లు కూటమి కంటే దాదాపు 12 శాతం ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపారని.. వీరి ఓట్ల వల్లే వైసీపీ తిరిగి అధికారం చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరా మస్తాన్ వెల్లడించారు.

ఇటీవలి  తెలంగాణ ఎన్నికల్లో అత్యంత కచ్చితంగా ఫలితాలు అంచనా వేసిన పొలిటికల్ లేబోరేటరీ సంస్థ 108 స్థానాలతో వైసీపీ అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేసింది.

వైసీపీ వైపు మొగ్గు చూపినవి:

  • ఆత్మసాక్షి : YSRCP: 98-116, TDP: 59-77
  • RACE : YSRCP: 117-128. TDP: 48-58
  • పోల్ స్ట్రాటజీస్ గ్రూప్ : YSRCP : 115-125, TDP: 50-60
  • ఆపరేషన్ చాణక్య : YSRCP : 95-102, TDP: 64-68
  • చాణక్య పార్ధదాస్ : YSRCP : 110-120, TDP: 55-65
  • జన్‍మత్ : YSRCP : 95-103, TDP: 67-75
  • WRAP స్ట్రాటజీస్ : YSRCP : 158-171, TDP: 0-04
  • అగ్నివీర్ : YSRCP : 124-128, TDP: 46-49
  • పొలిటికల్ లేబొరేటరీ : YSRCP : 108, TDP: 67

తెలుగుదేశం-బిజెపి-జన సేన కూటమి వైపు మొగ్గు చూపినవి:

  • పీపుల్స్ పల్స్ : టీడీపీ 95-110, జనసేన 14-20, బీజేపీ 2-5, వైసీపీ 45-60
  • ప్రిజమ్ : కూటమి 110, వైసీపీ 60 సీట్లు
  • చాణక్య స్ట్రాటజీస్ : కూటమి 114-125, వైసీపీ 39-49 సీట్లు
  • S-GED సర్వే:  టీడీపీ కూటమి 139, వైసీపీ 36 సీట్లు
  • NFOPL సర్వే: టీడీపీ కూటమి 104-110, వైసీపీ 65-71 సీట్లు
  • SAN సర్వే : టీడీపీ కూటమి127, వైసీపీ 48 సీట్లు
  • పయనీర్ :టీడీపీ కూటమి – 144,  వైసీపీ- 31
  • రైజ్: టీడీపీ కూటమి 113-122;  వైసీపీ 48-60; ఇతరులు 0-1
RELATED ARTICLES

Most Popular

న్యూస్