Saturday, January 18, 2025
HomeసినిమాPeddha Kapu -1: 'పెదకాపు'పై పెరుగుతున్న అంచనాలు!

Peddha Kapu -1: ‘పెదకాపు’పై పెరుగుతున్న అంచనాలు!

చాలాకాలం క్రితం గ్రామీణ నేపథ్యంలో కథలు ఎక్కువగా వచ్చేవి. ఆ తరువాత కాలంలో తెలుగు సినిమా విదేశాల వీధుల్లోనే ఎక్కువగా తిరుగుతూ వచ్చింది. మళ్లీ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా కథ పల్లెటూళ్లపై మనసు పారేసుకుంది. గ్రామం … అక్కడి రాజకీయాలు .. ప్రేమలు .. మొదలైన అంశాలతో మళ్లీ కొన్ని కథలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరహా కథలు ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ అవుతున్నాయి కూడా. అలాంటి ఒక కంటెంట్ తో వస్తున్న సినిమానే ‘పెదకాపు’.

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోగా విరాట్ కర్ణ నటించగా, ఆయన సరసన నాయికగా ప్రగతి శ్రీవాత్సవ కనిపించనుంది. సాధారణంగా విలేజ్ లో పెత్తనం కోసం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అధికారం కోసం వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎప్పటి నుంచో ఒక గ్రామంపై పట్టు కోసం గొడవలు పడుతున్న ఇద్దరు పెత్తందార్లకు వ్యతిరేకంగా ఒక సాధారణ యువకుడు సాగించిన పోరాటమే ఈ కథ. ఈ గొడవల చుట్టూనే ఒక అందమైన ప్రేమకథ అల్లుకుని ఉంటుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్ .. లవ్ కలగలిసిన సినిమాలను తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాలకి మంచి అనుభవం ఉంది. ఆ మూడూ కలగలిసిన కథగా రూపొందిన ‘పెదకాపు’ ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, సుకుమార్ ముఖ్య అతిథిగా ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోనుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్