Saturday, January 18, 2025
Homeసినిమా'దేవర' కొత్త అప్ డేట్

‘దేవర’ కొత్త అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు ‘దేవర’ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అభిమానులు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఫియర్ సాంగ్’ ను వదిలారు. ఇప్పుడు ఈ సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఆయన ఈ పాటను స్వరపరచడమే కాకుండా, స్వయంగా తానే ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ‘దూకే ధైర్యమా జాగ్రత్త .. దేవర ముందు నువ్వెంత’ అనేది ఈ పాటలోని హైలైట్ లైన్. ‘దేవర’ పాత్ర భయానికే భయం పుట్టించి .. ధైర్యానికే ధైర్యం చెప్పేలా ఉంటుందనే విషయాన్ని ఆయన ఈ ఒక్క లైన్ తో చెప్పేశాడు.

ఇప్పుడు ఈ పాటతో అమాంతంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ కెరియర్లో  ఇప్పటివరకూ చేసిన పవర్ఫుల్ రోల్స్ ఒక ఎత్తు .. ఈ సినిమాలోని పాత్ర ఒక ఎత్తు అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్, ప్రధానమైన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక వెన్నెల రాత్రులలో చిత్రీకరణ జరిగినట్టుగా అనిపించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం వాడుతున్నారు. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుండటం అదనపు ఆకర్షణ కానుంది. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్