No Change: పరిపాలనా వికేంద్రీకరణ వైసీపీ విధానమని, దానికే తాము కట్టుబడి ఉన్నామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో పరిపాలను వికేంద్రీకరించాలంటే మూడు రాజధానులు ఉండాలన్నది తమ అభిమతమని, అందులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా పరిపాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను గుర్తించిందని, అభివృద్ధి ఫలాలు అందరికీ చెందాలని చెప్పిందన్నారు. మూడు రాజధానులపై మళ్ళీ బిల్లు పెడతారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు.