Sunday, January 19, 2025
Homeసినిమాపొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ - దిల్ రాజు

పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ – దిల్ రాజు

Triple fun: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3‘. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌ టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైమౌతుంది. ఈ నేపధ్యంలో నిర్మాత దిల్ రాజు మీడియాతో ఎఫ్ 3 విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాట‌ల్లోనే..

“ఎఫ్ 2 విడుదలకు ముందే అనిల్ కు ఎఫ్ 3 ఐడియా వచ్చింది. ఎఫ్ 2 పెద్ద హిట్ అయితే ఎఫ్ 3 చేద్దామని చెప్పారు. మేము అనుకున్నట్లే ఎఫ్ 2 పెద్ద విజయం సాధించింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత స్క్రిప్ట్ ని పూర్తి చేసి నటీనటులందరినీ మళ్ళీ ఒక్కదగ్గరి చేర్చి సెట్స్ పైకి వెళ్లాం. ఎఫ్ 3 కథ చెప్పినపుడు ఎంత నవ్వుకున్నానో సినిమా చూసిన తర్వాత దానికి మించిన నవ్వుకున్నాను. ఎఫ్ 3 నాన్ స్టాప్ ఎంటర్ టైనర్, కంప్లీట్ ఫన్ రైడ్. ఎఫ్ 2లో ప్రేమ, పెళ్లి.. అందులో వున్న ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించి చివరికి భార్యల పాయింట్ ఆఫ్ వ్యూ ని కూడా చూడాలని చెప్పి అందరికీ నచ్చేలాగ ఎఫ్2ని హ్యుమరస్ గా చేశాం”

F3 Team

“ఎఫ్ 3 విషయానికి వస్తే.. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, గాలి.. ఇవి పంచభూతాలు. ఇవి లేకుండా మనిషి బ్రతకలేడు. ఈ పంచభూతాలతో పాటు ఆరో భూతం డబ్బు కూడా మనిషి బ్రతకడానికి అంతే అవసరం. డబ్బు లేకుండా మనిషి బ్రతకలేడు. చిన్నది కానీ పెద్దది కానీ ప్రతి మనిషి బ్రతకడానికి డబ్బు ఈ రోజు తప్పనిసరైపోయింది. బంధాలు, బిజినెస్సులు అన్నీ డబ్బుతోనే ముడిపడి వున్నాయి. అలాంటి డబ్బు చుట్టూ తిరిగేకథ ఎఫ్ 3. అనిల్ అద్భుతంగా రాశాడు, తీశాడు. అనిల్ లో నాకు నచ్చే అంశం కథ కంటే కధనంపై ఎక్కువ దృష్టి పెడతాడు.”

“ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తున్నామా లేదా అని చూస్తాడు. ఎఫ్ 3 ఆర్టిస్టులకు భోజనం లాంటింది. ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అద్భుతమైన ఫన్ క్రియేట్ చేశాడు అనిల్. సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ పూర్తయ్యేసరికి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను. ప్రేక్షకుడిగా ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలను. సినిమా రన్ టైం 2గంటల 28నిమిషాలు వుంటుంది. ఇందులో 90 నిమిషాలు నాన్ స్టాప్ గా నవ్వుతూనే వుంటారు. అంత ఫన్ రైడ్ గా వుంటుంది” అన్నారు.

Also Read : ఎఫ్ 3 రిలీజ్ కాకుండానే.. ఎఫ్ 4 ప్లాన్ చేస్తున్నారా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్