Saturday, January 18, 2025
Homeసినిమాఎఫ్‌ 3 షూటింగ్ కి ముహుర్తం ఖరారు?

ఎఫ్‌ 3 షూటింగ్ కి ముహుర్తం ఖరారు?

విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ రావడం.. అలాగే అనిల్ రావిపూడికి కూడా కరోనా రావడంతో షూటింగ్ బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. జూన్ 16 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. సారధి స్టూడియోలో వేసిన ఒక ఓల్డ్ హౌస్ లో వెంకీ, వరుణ్ ల పై కొన్ని కామెడీ సీన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్‌ తేజ్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆమధ్య రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో వెంకీ, వరుణ్‌ డబ్బుతో నిండిన ట్రాలీలను తోసుకుంటూ వెళుతున్నట్టుగా చూపించడంతో డబ్బు చుట్టే తిరిగే కామెడీ డ్రామా అని తెలుస్తుంది. అలాగే ఎఫ్ 2 సీక్వెల్ కాబట్టి ఎఫ్ 2 తో పోలిస్తే.. అంతకు మించి అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఆగష్టు 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎనౌన్స్ చేసినట్టుగా ఆగష్టు 27నే ఎఫ్ 3 ప్రేక్షకుల ముందుకు వస్తుందా..? వాయిదా పడుతుందా.? అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్