Sunday, January 19, 2025
Homeసినిమాఫన్ రైడ్ సెలబ్రేషన్స్ లో 'ఎఫ్ 3' టీమ్ సందడి!

ఫన్ రైడ్ సెలబ్రేషన్స్ లో ‘ఎఫ్ 3’ టీమ్ సందడి!

Fun Ride: అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ – వరుణ్ తేజ్ కథానాయకులుగా రూపొందిన ‘ఎఫ్ 3‘ ఈ నెల 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ‘ఎఫ్ 2’ని మించి ఉంటుందంటూ ఒక వైపున కామెడీ డోస్ ను .. మరో వైపున గ్లామర్ డోస్ ను పెంచడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఆర్టిస్టులతో చేసిన సినిమా ఇది. నిన్న ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. హీరోయిన్స్ తప్ప మిగతా వాళ్లంతా పాల్గొన్నారు.

ఈ స్టేజ్ పై వెంకటేశ్ మాట్లాడుతూ .. ఇది రెండు మూడేళ్ల తరువాత థియేటర్స్ కి వచ్చిన తన సినిమా అనీ, ఎంతో  ఓపికగా ఎదురుచూసిన తన అభిమానులు ఈ సినిమా విషయంలో సంతృప్తికరంగా ఉండటం తనకి సంతోషాన్ని  కలిగిస్తోందని చెప్పారు. ఇక వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించడం ఆనందంగా ఉందనీ, చిన్నపిల్లలకు కూడా ఈ సినిమా నచ్చడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు. ఈ టీమ్ తో కలిసి మళ్లీ పనిచేయాలనుందని చెప్పాడు.

ఇక రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ .. “ఈ సినిమా హిట్ కాకపోతే నా ముఖం చూపించనని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. నవ్వును మీరు ఆదరిస్తారనే నమ్మకంతోనే ఆ రోజున ఆ మాటను ధైర్యంగా అన్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కనుకనే మళ్లీ మీ ముందుకు వచ్చాను. 45  ఏళ్లుగా నేను నమ్ముకుంటూ వచ్చిన నవ్వు .. నాకు మరో హిట్ ఇచ్చింది” అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. కోవిడ్ కారణంగా థియేటర్లకు దూరమైన ఫ్యామిలీ ఆడియన్స్ ను ‘అఖండ’ .. ‘పుష్ప’ .. ‘ భీమ్లా నాయక్’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ థియేటర్లకు రప్పించాయి. ఆ జాబితాలో ‘ఎఫ్ 3’ చేరడం గర్వంగా ఉందంటూ  చెప్పుకొచ్చాడు.

Also Read :  ఫన్ రైడ్ సెలబ్రేషన్స్ లో ‘ఎఫ్ 3’ టీమ్ సందడి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్