Family Counselling :
Q.నా ఫ్రెండ్ కి పెళ్లయి ఏడేళ్లు. ముగ్గురు పిల్లలు. భర్త విదేశంలో ఉద్యోగం. అప్పుడప్పుడు వస్తాడు. అయితే అతనికి పెళ్ళికి ముందునుంచే ఒక అమ్మాయితో సంబంధం ఉంది. అతని తల్లిదండ్రులకు కూడా ఆ విషయం తెలిసినా దాచిపెట్టి పెళ్లి చేసారు. పెళ్లయ్యాక నా స్నేహితురాలికి తెలిసింది. పిల్లలు పుడితే మారతాడనుకుంది. కానీ అతను ఇంట్లో కన్నా ప్రియురాలితోనే ఎక్కువ గడుపుతున్నాడు. అత్తమామలకు చెప్తే నీకేం లోటు చెయ్యడం లేదుకదా అంటున్నారు. పుట్టింట్లో చెప్పలేక బాధ భరించలేక సతమతమవుతోంది. కనీసం పిల్లలతో కూడా అతను గడపటం లేదు. ఏం చేయాలో తెలియని స్థితి లో నా స్నేహితురాలు కుమిలిపోతోంది.
-మనీషా
A.పెళ్లయ్యాక మీ స్నేహితురాలికి భర్త అక్రమ సంబంధం గురించి తెలిసినపుడే ధైర్యం చేసి తాడో పేడో తేల్చుకోవలసింది. పిల్లలు పుడితే మారతాడని ఈవిడ అనుకుంది. విషయం తెల్సినా ఊరుకుందికదా అని అతను అనుకున్నాడు. అత్తమామలూ సహజంగా కొడుకు పక్షానే ఉంటారు. ఇప్పుడు మీ స్నేహితురాలికి అటు పుట్టింటి ఆసరా లేదు. ఇటు ఉద్యోగం లేదు. పైగా ముగ్గురు చిన్న పిల్లలు. ఈ పరిస్థితుల్లో చట్టపరమైన చర్యలు కోరినా ఏళ్ళు పడుతుంది. అందుకే ఆర్థికంగా బలపడటానికి ప్రయత్నించాలి. మీ ఫ్రెండ్ చదువుకుని ఉంటే ఏదన్న ఉద్యోగంలో చేరాలి. ఆర్థిక స్వావలంబన ధైర్యాన్నిస్తుంది. అలాగే తన పేరున, పిల్లల పేరున స్థిర చరాస్తులు సమకూరేలా చూసుకోవాలి. అప్పుడు ఆమెకే తెలుస్తుంది భర్తను ఎలా మార్చుకోవాలో.
Family Counselling
-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]
Also Read:
Also Read: