Sunday, January 19, 2025
Homeఫీచర్స్మళ్లీ ఉద్యోగం చేయగలనా?

మళ్లీ ఉద్యోగం చేయగలనా?

Family Counselling :

Q. నా వయసు 32. వివాహమైంది. నేను 2009 లో కెరీర్ స్టార్ట్ చేసాను . 2012 వరకు సాఫ్ట్ వేర్ లో  చేసాను. తర్వాత కొన్ని కారణాల వల్ల జాబ్ మానేసాను. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. చిన్న బాబు కి 2 సంవత్సరాలు వయసు. పెద్ద బాబు కి 4 సంవత్సరాల వయసు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నాను. కాకపోతే ఏం చేయలేకపోతున్నాను అని అనిపిస్తుంది. పిల్లలు కొంచెం పెద్దయ్యాక సాఫ్ట్ వేర్ చెయ్యాలా లేదంటే ఏదన్నా బ్యాంక్ జాబ్ కి ప్రయత్నించాలా లేదంటే ఏదన్నా ఇంట్లో ఉండి చేసే ఉద్యోగం మంచిదా అర్థం కావట్లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు. పిల్లలను చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఎవరు వచ్చి ఉండటం కుదరదు.
-లక్ష్మి

A. ఏ ఉద్యోగమైనా కొంతకాలం ఆపేసి మళ్ళా చెయ్యడం కష్టమే. పైగా ఇంట్లో ఉండటం అలవాటవుతుందేమో ఓ పట్టాన వెళ్ళబుద్ధి కాదు. ముందు మానసికంగా సిద్ధం కావాలి. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే కాబట్టి మొదట ఇంట్లో ఉండి చేసుకునే పార్టుటైం ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. పిల్లలను చూసుకోడానికి మనిషిని పెట్టి లేదా కేర్ సెంటర్ లో ప్రయత్నించాలి. దీనికి వాటిగురించి బాగా తెలుసుకోవాలి. ఇక మీ భర్త నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో చూసుకోండి. ఇంటిపని అంతా మీదే అయితే కష్టమే. అలా కాక చేదోడు వాదోడు గా ఉంటే ఫర్వాలేదు. ఏదయినా పిల్లలకి మెల్లిగా అలవాటు చేయాలి. ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఉద్యోగం చేయాలనుకుంటే. ఏదయినా పర్లేదనుకుంటే ఇంట్లో ఉండే మీ అభిరుచులు, ఆసక్తులకు తగ్గ వ్యాపకం చూసుకోవచ్చు.

Family Counselling

-కె.శోభ,
ఫ్యామిలీ కౌన్సెలర్,
హార్ట్ టు హార్ట్,
[email protected]

Also Read:

అతను మారేదెలా?

Also Read:

ఎప్పుడూ గొడవలేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్