Sunday, March 16, 2025
HomeసినిమాTemple For Samantha: సమంతకు గుడి కడుతున్న అభిమాని

Temple For Samantha: సమంతకు గుడి కడుతున్న అభిమాని

అభిమాన కథానాయికలకు గుడి కట్టి ఆరాధించడం అనేది తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది. ఒకప్పుడు తమిళనాడులో అందాల కథానాయిక ఖుష్బూకు గుడి కట్టడం అప్పట్లో సంచలనం. ఆతర్వాత కొన్ని కారణాల వలన గుడి కట్టినవాళ్లే కూల్చేసారు. ఈమధ్య కాలంలో నిధి అగర్వాల్ కు కూడా గుడి కట్టారు. ఇక డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు కూడా గుడి కట్టడం విశేషం. ఇలా సినీ తారల పై తమకున్న అభిమానాన్ని చూపిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి అభిమానమే సమంత పై చూపిస్తూ గుడి కట్డడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. నటిగా ఆమెను ఎంతో ఆరాధించే సందీప్.. ఆమె చేసే పలు సేవా కార్యక్రమాలకు మరింత ఆకర్షితుడయ్యాడు. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటంలో ఆమె చూపిస్తున్న చొరవకు ఆయన అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదు కానీ.. ఆమె పై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు. సమంత సినిమాల విషయానికి వస్తే.. యశోద సినిమాతో ఈమధ్య సక్సెస్ సాధించింది. అయితే.. శాకుంతలం సినిమాతో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో సమంత సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్