Saturday, January 18, 2025
Homeసినిమాబిజినెస్ లోకి ప్ర‌భాస్.. వద్దంటున్న ఫ్యాన్స్?

బిజినెస్ లోకి ప్ర‌భాస్.. వద్దంటున్న ఫ్యాన్స్?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌ల రాధేశ్యామ్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో ఈసారి ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్‌, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాలు ఉన్నాయి. వ‌చ్చే సంవ‌త్స‌రం జ‌న‌వ‌రిలో ఆదిపురుష్‌, స‌మ్మ‌ర్ లో స‌లార్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల‌తో పాటు మరికొన్ని చిత్రాలకు కూడా ప్ర‌భాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ కూడా బిజినెస్ బాట పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్సుల నిర్మాణంలో ఉన్నారు. మహేష్ అయితే ఇప్పటికే ఏఎంబీ మాల్స్ పేరుతో అందరికంటే ముందున్నాడు. ఇక రామ్ చరణ్ ట్రూ జెట్ విమానయాన సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కూడా వ్యాపార రంగంలోకి కాలుమోపుతున్నట్టు సమాచారం.

అయితే.. ప్రభాస్ మంచి భోజన ప్రియుడు కావడంతో ఆయన రెస్టారెంట్ల బిజినెస్ లోకి వస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  స్పెయిన్ దుబాయిల్లో హోటళ్లు నిర్మిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభాస్ టీమ్ రంగంలోకి దిగిందని.. హోటళ్ల నిర్మాణంపై కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇక అంతా ఫైనల్ అయ్యాక అధికారికంగా వెల్ల‌డిస్తార‌ట‌. అయితే.. ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తే ఇంకా బిజీ అవుతాడ‌ని.. హెల్త్ ప్రాబ్ల‌మ్ వ‌స్తుంద‌ని బిజినెస్ లు వ‌ద్దు ప్ర‌భాస్ అంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతుండ‌డం విశేషం.

Also Read : ప్రభాస్ పట్టుదలే కారణం: కృష్ణంరాజు  

RELATED ARTICLES

Most Popular

న్యూస్