Saturday, January 18, 2025
HomeTrending Newsమీటర్లతో జవాబుదారీతనం: సిఎం

మీటర్లతో జవాబుదారీతనం: సిఎం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వాళ్ళ రైతులకు నిరంతరం అవహాహన కల్పించాలని, దీనివల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  ఇంధనశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ మీటర్ల ద్వారా  రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారని అధికారులు సమావేశంలో వివరించగా, మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని, రైతులకు సరిపడా విద్యుత్‌ను పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని  సిఎం వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ మీటర్లు బిగించడం ద్వారా రైతుల మోటార్లు, ట్రాన్స్‌ ఫార్మర్లు కాలిపోవని, రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని అన్నారు.  వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును కూడా నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతామని తెలిపారు. అక్కడనుంచి ఆడబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందని, దీనివల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయని సిఎం వివరించారు. మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడని అభిప్రాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందని సిఎం అన్నారు.  ఈ వివరాలను కూడా విడుదల చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని, ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని… విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు.  సిఎంకు వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్,అటవీ పర్యావరణం, భూగర్భ గనులు, శాస్త్ర సాంకేతిక శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, విద్యుత్‌ శాఖస్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఏపీ జెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : వరి ఎగుమతులపై దృష్టి పెట్టండి: సిఎం సూచన

RELATED ARTICLES

Most Popular

న్యూస్