రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ఫ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ఫ్‌లో 4,500 మంది పని చేస్తున్నారు. సెర్ఫ్ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ఫ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధిహామీలో పని పని చేస్తారు.
వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నరు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పుమని చేయమని చెప్పారు. అందరి మాటనే నా మాట.. వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కౌన్సిల్లో ఎమ్మెల్సీ కవితని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఐకెపి సంఘం నాయకులు మరియు ఉద్యోగులు
పేదరిక నిర్మూలనలో, డ్వాక్రా మహిళల సంఘాల కు నిధులు అందించి, విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ (SERP) లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు అందిస్తామని ప్రకటించారు. అలాగే ఇందులో భాగంగా పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు ఇస్తామని సీఎం తెలిపారు. మరోవైపు గత కొంత కాలంగా ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామన్నారు. అయితే భేషజాలకు పోయి ఆందోళనలు, ధర్నాలు చేయవద్దని, అలా చేయకుండా ఉండాలని సీఎం సూచించారు. దీంతో 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి వారి ఉపాధి వారికి లభించినట్లు అయింది.
Also Read : తెలంగాణపై కేంద్రం వివక్ష..భట్టి విక్రమార్క ఫైర్