Not yet: మంత్రివర్గం కూర్పు ఇంకా పూర్తి కాలేదని, కసరత్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. సిఎం జగన్ తో సమావేశం ముగిసిన తరువాత సజ్జల మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం ఏడు గంటలకు మంత్రివర్గ జాబితాను రాజ్ భవన్ కు పంపే అవకాశం ఉందని చెప్పారు. అన్ని అంశాలనూ బేరీజు వేసుకుని మంత్రివర్గం కూర్పు జరుగుతోందని, సిఎం జగన్ అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు.
మరోవైపు 24 మందితో కూడిన మంత్రివర్గం చేసిన రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. నిన్ననే రాజ్ భవన్ కు మంత్రుల రాజీనామా పత్రాలు చేరుకున్నాయి. వాటిని పరిశీలించిన గవర్నర్ రాజీనామాలకు ఆమోదం తెలిపారు, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కాసేపట్లో విడుదల కానుంది.