Wednesday, June 17, 2026
Homeస్పోర్ట్స్International Cricket: ఆరోన్ ఫించ్ గుడ్ బై

International Cricket: ఆరోన్ ఫించ్ గుడ్ బై

ఆస్ట్రేలియా టి 20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. గత ఏడాది వన్డే ఫార్మాట్ నుంచి వైదొలిగిన ఈ స్టార్ ప్లేయర్ తాజాగా టెస్ట్, టి 20 ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బిగ్ బాష్ లో కొనసాగుతానని వెల్లడించారు.

ఆసీస్ కు ఐసిసి టి 20 వరల్డ్ కప్ అందించిన జట్టు కెప్టెన్ గా ఫించ్ ఘనత సాధించాడు. అయితే గత నవంబర్ లో స్వదేశంలో జరిగిన టి 20 వరల్డ్ కప్ లో కనీసం నాకౌట్ దశకు కూడా ఆస్ట్రేలియా చేరుకోలేకపోయింది, అప్పటినుంచి కెరీర్ పరంగా  గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఫించ్ అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ పై చెప్పాడు. 12 ఏళ్ళపాటు జాతీయ జట్టుకు సేవలు అందించిన 146వన్డేలు ఆడి 5406 రన్స్ సాధించాడు, వాటిలో 17 సెంచరీ లు ఉన్నాయి. ఇక టి 20ల విషయానికి వస్తే 103 మ్యాచ్ లు ఆడి 3120 రన్స్ చేశాడు, 2 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular