హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఖాళీ స్థలాలపై కన్నేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్ఎండిఏ కొరడా జులిపించింది.
జవహర్ నగర్ హెచ్ఎండిఏ భూములలో అక్రమ నిర్మాణాలను మంగళవారం ఉదయం హెచ్ఎండిఏ ఎస్టేట్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా కూల్చివేశాయి.
హెచ్ఎండిఏ పరిధిలోని పలు సర్వే నెంబర్లలో దాదాపు మూడు వేల(3,000) గజాల స్థలాల్లో వచ్చిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. వాటిల్లో మూడు (3) ఇండ్లు, ఐదు (5) బేస్మెంట్లు, కొన్ని కరెంటు స్తంభాలు, కొన్నిచోట్ల కాంపౌండ్ వాల్ నిర్మాణాలు ఉన్నాయి.
జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ భూములలో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిని గుర్తించారు. వారిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెచ్ఎండిఏ అధికారులు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు.