Thursday, March 28, 2024
HomeTrending Newsన్యూయార్క్ సబ్ వేలో కాల్పులు

న్యూయార్క్ సబ్ వేలో కాల్పులు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లో అత్యంత రద్దీగా ఉండే బ్రూక్లిన్ సబ్ వే స్టేషన్లో జరిగిన కాల్పుల్లో దాదాపు 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలోచాలా మంది కిందపడిపోయి రక్తమోడుతున్న ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. దీంతో అమెరికాలో తీవ్ర కలకలం రేగింది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని సబ్‌వే స్టేషన్‌లో పలువురు వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కనీసం 13 మంది గాయపడ్డారని వార్తా సంస్థ ఏఎఫ్ పీ పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తి ఇప్పటికీ ఆ ప్రాంతంలో యాక్టివ్‌గా ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రద్దీ సమయంలో ఉదయం 8:30 గంటలకు దాడి జరిగిన ప్రదేశంలో పేలుడు పదార్థాలు కనిపించాయని కొన్ని నివేదికలు తెలిపాయి. రైళ్లను నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

 Firing Subway

న్యూయార్క్ పోలీసుశాఖ అధికారులు బ్రూక్లిన్‌లోని 36వ వీధి, 4వ అవెన్యూ ప్రాంతం వద్దకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. అత్యవసర వాహనాలు, పరిసర ప్రాంతంలో ఆలస్యం తప్పదని ప్రయాణికులను ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయితే ఈ ప్రాంతంలో యాక్టివ్ పేలుడు పదార్దాలు మాత్రం లేవని న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో సీసీకెమెరాల్లో కనిపించిన వ్యక్తులకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి యాక్టివ్ పేలుడు పరికరాలు లేవని వారు పేర్కొన్నారు. ఎవరైనా సాక్షులు @NYPDTipsకి #800577TIPSకి కాల్ చేయమని సూచించారు.

Also Read : యూఎస్ పాఠశాలలో కాల్పుల కలకలం

RELATED ARTICLES

Most Popular

న్యూస్